Site icon TeluguMirchi.com

కామెడీ చేస్తున్న బాలయ్య

balayya
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఫిల్మ్‌సిటీలోని ఫ్లెక్స్ హౌస్‌లో బాలకృష్ణ, ఇతర ముఖ్య పాత్రధారులపై హాస్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ, ఫైటర్లపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 8 వరకు ఇక్కడే చిత్రీకరణ జరుగుతుంది. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష కధానాయిక. రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version