సీబీఐ ఆఫీసర్ గా బాలయ్య

cbi
నందమూరి బాలకృష్ణ మరో సారి పోలీసు గెటప్ లో అదరగొట్ట బోతున్నారు. సీబీఐ ఆఫీసర్ పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైయ్యారు కొత్త దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యద్విపాత్రాభినయం చేస్తున్నారు. వీటిలో ఓ పాత్రను సీబీఐ ఆఫీసర్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం. ఇది చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి సమీపంలోని రంపచోడవరం అడవుల్లో జరుగుతోంది. చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.