Site icon TeluguMirchi.com

చిరు సినిమా ఫై బాలయ్య స్పందన..

Balakrishna-khaidi

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి..ఈ చిత్రం విడుదల కు ఇంకా పట్టుమని 24 గంటలు మాత్రమే ఉంది..మరోపక్క అమరావతి లో ఈ చిత్ర ప్రత్యేక షోస్ వేయడం జరుగుతుంది..ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు శాతకర్ణి బాలకృష్ణ కెరియర్ లోనే మైలురాయి గా నిలిచిపోబోతుందని అంటున్నారు..

ఇక నిన్నంతా ప్రమోషన్స్ లలో బిజీ అయినా బాలయ్య సినిమా లోని హైలైట్స్ ను మీడియాతో పంచుకున్నారు..అలాగే శాతకర్ణి తో పాటు రిలీజ్ అవుతున్న చిరంజీవి 150 వ చిత్రమ్ ఖైదీ ఫై కూడా ఆయన స్పందించాడు..’నాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత ముఖ్యమో.. చిరంజీవికి ఖైదీ నంబర్ 150 కూడా అంతే. రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాలని.. రెండూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి విందు భోజనం కావాలని ఆశిస్తున్నా’ అన్నారు.

Also Read :`గౌతమిపుత్ర శాతకర్ణి` క్లైమాక్స్ ఇలా ఉంబోతుందో తెలిస్తే షాకే.

మెగా స్టార్ చిరంజీవి తో పాటు మెగా హీరోలు కూడా గౌతమీపుత్ర మంచి విజయం సాధించాలని , సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న ఈ రెండు చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా మంచి విజయం సాధించి , అందరికి సంతోషాన్ని నింపాలని వారు కోరడం జరిగింది.

Exit mobile version