Site icon TeluguMirchi.com

రూల‌ర్‌ కి ముహూర్తం కుదిరింది

Balakrishnas-Rulerఎట్టకేల‌కు సింహా కాంబినేష‌న్ సెట్స్‌ పైకి వెళ్లబోతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో ఓ సినిమా ఎప్పటి నుంచో పైప్ లైన్‌ లోనే ఉండిపోయింది. ఈ సినిమాకి ‘రూల‌ర్’ అనే పేరు ఫిక్స్ చేశారు. అయితే సెట్స్‌ పైకి వెళ్లడానికి మాత్రం జాప్యం చేస్తున్నారు. బాల‌య్య రాజ‌కీయ వ్యవ‌హారాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌.. ఈ సినిమాకి కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోతున్నారు. ఇంత కాలానికి ఈ సినిమాకి ముహూర్తం పెట్టేశారు. జూన్ 15వ తేదీన ఈ సినిమాని లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ని స‌మాచార‌మ్‌. 14 రీల్స్ ఎంటర్‌ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. ప్రస్తుతం క‌థానాయిక‌ల ఎంపిక జ‌రుగుతోంది.

Exit mobile version