Site icon TeluguMirchi.com

బాలయ్యను చంపేసిన వికీపీడియా….


ఒక ప్రక్క నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉంటె, మరో ప్రక్క నంద‌మూరి బాల‌కృష్ణ‌ పుట్టిన తేదీతో పాటు మ‌ర‌ణించిన తేదీ కూడా వికీపీడియా లో ఉండ‌డంతో ఇది చూసి షాక్ కావ‌డం అంద‌రి వంతు అయింది.

ఇప్పుడు ఉన్న ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరు గూగుల్‌ తోనే తమ పనులను సగం వరకు పూర్తి చేసేస్తున్నారు. ఒక్కోసారి గూగుల్ లేక‌పోతే ప్రపంచం ఏమైపోతుందో అనే అనుమానం స‌గ‌టు మ‌నిషికి రాక మాన‌దు. గూగుల్‌కి సంబంధించిన వాటిలో అక్కడక్కడా కొన్ని త‌ప్పులు దొర్లుతున్నా కూడా మ‌నిషి మాత్రం దానిపైన ఆధార‌ప‌డ‌డం మాన‌డం లేదు.

అయితే తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌ 23 ఏళ్ల క్రితమే అనగా.. 1995లోనే మరణించినట్టుగా వికీపీడియాలో దర్శనం ఇచ్చింది. బెంగుళూరులో మరణించినట్టుగా ప్లేస్ కూడా డిసైడ్ చేసేశారు. కొద్ది క్షణాల్లోనే ఈ వార్త వైర‌ల్‌గా మార‌డంతో బాల‌య్య అభిమానులు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. జ‌రిగిన త‌ప్పుని స‌రిచేసుకునే లోపే జ‌ర‌గ‌రానిదంతా జ‌రిగిపోవ‌డంతో ఫ్యాన్స్ గూగుల్‌కి హెచ్చ‌రిక‌లు పంపారు.ఎట్ట‌కేల‌కు కొద్ది సేప‌టి త‌ర్వాత బాల‌య్య డెత్‌డేట్‌ని తొల‌గించి అభిమానుల ఆవేశాన్ని చ‌ల్లార్చారు.

అసలు కన్నడ నటుడు టీఎన్ బాలకృష్ణ 1995లో మరణించారు. ఆయన బయో డేటా బదులు పొర‌పాటున నందమూరి బాలకృష్ణ డేటాను వికీపీడియాలో జతచేయడంతో వివాదం రేగింది.

Exit mobile version