కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమవంతు సాయం ప్రకటించగా తాజాగా సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ. 25 లక్షల విరాళం అందజేశారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయిలు ఆర్ధిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. కాస్త లేటుగయినా పెద్ద ఎమౌంటే బాలకృష్ణ అందజేశారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.