యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రాన్ని తెరకెక్కించి పూరీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత పూరీకి మళ్లీ సక్సెస్ రుచి దొరకలేదు. ఆ చిత్రంలో కోర్టు సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కోర్టు సీన్‌నే ఇప్పుడు బాలయ్య చిత్రంలో కూడా చేయబోతున్నారట. విషయానికొస్తే బాలయ్యబాబు 101వ చిత్ర భాద్యతలు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు అప్పగించాడు.
పూరీ చేసే సొంత ప్రయోగాల వల్ల ఇప్పుడు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా కూడా బాలయ్య కోసం చాలా పవర్‌ఫుల్‌గా కథను తయారుచేస్తున్నాడట. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలె ప్రారంభం అయ్యింది. కాగా ఈ కథ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు. ‘శాతకర్ణి’ చిత్రంతో చారిత్రాత్మక హిట్‌ను సొంతం చేసుకున్న బాలయ్య తదుపరి చిత్రం కోసం అనేక దర్శకుల పేర్లు వినిపించి చివరకు పూరీ ఫైనల్ అయ్యాడు. దాంతో ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా సీరియస్‌గా తీసుకున్నాడట. ఇకపోతే కథ కోసం అభిమానులు చాలా ప్రయోగాలు చేయగా కథ రివీల్ కాలేదు కానీ క్లైమాక్స్ తెలిసిపోయింది.
‘టెంపర్’ చిత్రంలాగే ఈ చిత్రంలో కూడా పవర్ఫుల్ కోర్టు సీన్ ఉంటుందట. ఆ చిత్రంలో ఉండే దానికంటే మించిపోయేలా ఈ కోర్టు సీన్ ఉంటుందట. సినిమా మొత్తానికి కోర్ట్ సీన్ చాలా ప్లస్ అవుతుందట. ఇకపోతే బాలయ్యబాబును కూడా పూరీ కోర్టుకు తీసుకెళ్తుంటే ఆ సీన్లో చాలా మహిమ ఉందని, అంతేకాదు కోర్ట్ సీన్ బలంగా ఉండడంతో, దానికి పడిపోయే పూరీకి సిగ్నల్ ఇచ్చాడు అని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.