బాలయ్య105 బడ్జెట్‌ ఎంతో తెలుసా?

నందమూరి బాలకృష్ణ ఈమద్య కాలంలో వరుసగా ఫ్లాప్‌లే దక్కించుకుంటున్నాడు. అయినా కూడా సినిమాల ఎంపిక విషయంలో ఈయన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బాలకృష్ణ ఇటీవలే జై సింహా అనే అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాను కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితం మర్చి పోకుండానే అప్పుడే బాలయ్య మరో సినిమాను ఆయన దర్శకత్వంలోనే చేయడంకు సిద్దం అయ్యాడు. పైగా ఈ చిత్రం కోసం ఏకంగా 30 కోట్ల బడ్జెట్‌ను సి కళ్యాణ్‌ ఖర్చు చేస్తున్నాడు.

బాలయ్య మూవీ సూపర్‌ హిట్‌ అయితే తప్ప 30 నుండి 40 కోట్లు వసూళ్లు సాధ్యం కాదు. ఫ్లాప్‌ అయితే 5 నుండి 10 కోట్లు కూడా రాబట్టలేదు. ఇలాంటి సమయంలో బాలయ్యపై 30 కోట్లు పెట్టడం అంటే అది అతి పెద్ద తెలివి తక్కువ తనం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణకు స్టార్‌ హీరో ఇమేజ్‌ అయితే ఉంది కాని అంత పెద్ద బడ్జెట్‌ను మోసే సత్తా మాత్రం లేదని ఒప్పుకోవాల్సిన నిజం. బాలయ్యపై సి కళ్యాణ్‌ పెడుతున్న ఆ మొత్తం డబ్బులో ఎంత మేరకు పోయేను ఎంత వరకు వచ్చేనో అంటూ అప్పుడే అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే చాలా నమ్మకంగా ఉండటం వల్లే అంత బడ్జెట్‌ పెడుతున్నారు. మరి వారి నమ్మకం నిజమయ్యేనేమో చూడాలి.