నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘పింక్’ రీమేక్ లో నటించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం పింక్ తమిళ రీమేక్ తెరకెక్కుతుంది. అజిత్ ఆ రీమేక్‌లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక తెలుగులో కూడా ఆ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్‌రాజు చాలా ఆసక్తిగా ఉన్నాడు. తెలుగులో రీమేక్ చేసి ప్రేక్షకులకు అందించాలని దిల్‌రాజు ఇప్పటికే రైట్స్ తీసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో లీడ్ రోల్‌ను ఎవరు పోషిస్తారా అంటూ ఎదురు చూసిన ప్రేక్షకులకు ఆసక్తికరంగా బాలయ్య బాబు అంటూ సమాధానం అందుతోంది.
‘పింక్’ రీమేక్‌కు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించడం జరిగిందట. దిల్‌రాజు ఇప్పటికే బాలయ్యను ఒప్పించడాని కూడా తెలుస్తోంది. ఒక వైపు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను నటిస్తూనే బాలయ్య ఈ రీమేక్‌లో నటిస్తాడనే టాక్ వినిస్తుంది. పింక్ రీమేక్ బాలయ్య ఇమేజ్‌కు ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆయన అభిమానులు అంటున్నారు. అయినా కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆడవారు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులు మరియు ఇతరత్ర సమస్యలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.