Site icon TeluguMirchi.com

మాట కోసం పూరీకి మరో ఆఫర్‌ ఇచ్చిన బాలయ్య

balayya puriనందమూరి బాలకృష్ణ చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో మంచి విజయాన్ని అందుకుని వందో చిత్రంతో ఫుల్‌ జోషు మీదున్న బాలయ్య 101వ చిత్రాన్ని డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర రెండవ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. చాలామంది దర్శకుల కథలు విన్న తర్వాత బాలయ్యబాబు పూరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రధానమైన సన్నివేశాల షూటింగ్‌ జరుగుతోంది. కాగా ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని పూరీ జగన్నాథ్‌ పట్టు పట్టాడట. కానీ తన 101వ చిత్ర ఆఫర్‌ నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌కేనని బాలయ్య ఎప్పుడో మాట ఇచ్చాడట. అందుకే ఈ చిత్రాన్ని కచ్చితంగా భవ్య క్రియేషన్‌ పతాకంపైనే నిర్మించాలని బాలయ్య గట్టిగా డిసైడ్‌ అయ్యాడు.

తన మాట కోసం బాలయ్య పూరీకి సారీ చెప్పి ఇదైతే కచ్చితంగా ఆనంద్‌ ప్రసాద్‌కే దక్కుతుంది కావాలంటే తదుపరి చిత్రాన్ని నువ్వు తీసుకో, కచ్చితంగా మళ్లీ మనం ఒక చిత్రాన్ని చేద్దాం అంటూ పూరీకి మాట ఇచ్చాడట. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం బాలయ్య పూరీకి మరో మాట ఇచ్చాడట. దీన్ని బట్టి చూస్తుంటే మళ్లీ బాలకృష్ణ, పూరీల కాంభో ఉంటుందట. 101వ చిత్రం ఫలితం తదుపరి చిత్రంపై ప్రభావం చూపిస్తుందా…?? లేదంటే తన మాట కోసం కచ్చితంగా పూరీకే అవకాశం ఇస్తాడా..?? అనేది చూడాలి.

Exit mobile version