బాలకృష్ణ తో ఆ పని చేసిన చెన్నై బ్యూటీ…

Lion-2-lip-lockనందమూరి నటసింహ బాలకృష్ణ…ఇతగాడి సినిమాలు అంటే భారీ యాక్షన్ సీన్లు, పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రమే ఉంటాయని అందరు భావిస్తారు. కానీ తన అప్ కామింగ్ మూవీ ‘లయన్’ లో వీటితో పాటు రొమాన్స్ ని ఇష్టపడే ప్రేక్షేకుల కోసం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా జత చేసాడట దర్శకుడు సత్యదేవ్.

ఈ చిత్రం లో తొలిసారి జంటగా నటిస్తున్న బాలకృష్ణ – త్రిష మధ్య లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. అంతే కాక రొమాంటిక్ సీన్లు ఊహకందని రేంజ్ లో ఉన్నాయని ఆ సీన్స్ లలో త్రిష – బాలయ్య పోటాపోటిగా నటించారని ఆ సన్నివేశాలను చూసి బాలయ్య అబిమానులు ఎంజాయ్ చేయడం ఖాయం అని అంటున్నారు చిత్ర యూనిట్.

బాలకృష్ణ , త్రిష , రాధిక ఆప్టే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ అందించిన పాటలకు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రం మే 1 న ప్రేక్షేకుల ముందుకు రాబోతుంది.