లెజెండ్‌….ఓ చెంపదెబ్బ

Balakrishna
లెజెండ్‌ చిత్రం సాధించిన ఘనవిజయంతోతెలుగు సినీపరిశ్రమకు కొత్త ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య రోజుల్లో సీనియర్‌హీరోలకు అంత పెద్ద హిట్‌ రానేలేదు. పూర్తిగా హిట్‌ అన్నమాటను సీనియర్‌ హీరోలు మరచిపోయారు. కెరీర్‌ను కొనసాగించాలీ అనే ఒకే ఒక్క పట్టుదలతో మల్లీస్టారర్స్‌తొ కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. ఒక్క బాలయ్య మాత్రమే తనదైన పంథాలో చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. తనకి అనువైన లేదా తన హీరో ఇమేజ్‌కి సరిపోయిన కథలనే చూసుకుని, ధైర్యంగా కెరీర్‌ను నిలబెట్టుకుంటున్నారు. ఈమథ్యన వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తప్పితే అంత గొప్పగా చెప్పుకునే హిట్స్‌ ఏ హీరోకీ రాలేదు. భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ బాక్సాఫీసు దగ్గర బాంబులు పేలినట్టుగా పేలాయి. నిర్మాతలు నెత్తిన గుడ్డేసుకుని మూలన కూర్చున్నారు. అలాటిది లెజెండ్‌ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తయారవుతుంటే మెచ్చుకన్నవాడొక్కడులేడు. అందరూ ఫెయిల్యూర్‌నే ఊహించారు. కొందరు ఆశించారు. పైగా ఆ టైటిల్‌ చాలా భయపెట్టింది.

బాలయ్య సినిమాలంటేనే జోకుగా మాట్లాడడం అందరకీ అలవాటైపోయింది. మోర్నింగ్‌షో అయ్యేవరకూ చాలామంది రకరకాల పేరడీలు, జోకులు రెడీ చేసి పెట్టుకున్నారు. లెజెండ్‌ టైటిల్‌పైన, హీరో బాలయ్య పైన. మొదటిఆట పూర్తయ్యేసరికి అందరి నోళ్ళకు తాళాలు పడ్డాయి. పదుల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన లెజెండ్‌కి మామ్మూలు టాక్‌ సరిపోనేపోదు. ఎంతో పెద్ద టాక్‌ వస్తేగానీ, పంపిణీ రంగానికి ఊపిరి ఆఢదు. అలాటిది టెజెండ్‌ టాక్‌ విని అందరూ హతాశులైపోయారు. అంత పెద్ద టాక్‌ వచ్చింది. సీనియన్‌హీరో అన్నమాటను, ఆ ఇమేజ్‌ని రియల్‌ ఛాలెంజ్‌తో బాలయ్య నిరూపించారు.

బాలయ్య మీద ఓ టాక్‌ ఉంది పరిశ్రమలో. మంచికథ దొరికి, డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా పడితే బాలయ్యకి తిరుగులేదన్నది ఆ టాక్‌. ఎన్ని ట్రెండ్స్‌ మారిపోయినా, ఏవేవో లూజ్‌డైలాగ్‌ల రోజులొచ్చినా తన డైలాగ్‌ డెలివరీకి, తన ఇమేజ్‌కీ ఏమీ ఢోకా లేదని బాలయ్య మరోసారిటెజెండ్‌ చిత్రంతోరుజువు చేశారు. విడుదలైన సెంటర్లన్నిటిలోనూ లెజెండ్‌ దుమ్ము లేపుతోంది. సంచలన కథానాయకుడిగా బాలయ్య మరోసారి తిలుగు సినీ పరిశ్రమలో తన రికార్డును నిలబెట్టుకున్నారు. బాలయ్య ఇమేజ్‌ తిరుగులేనిదని టెజెండ్‌ మరోసారిమరోసారి తేటతెల్లం చేసింది.

సింహా తర్వాత బోయిపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్‌ వాళ్ళ కాంబినేషన్‌కున్న గోల్డన్‌టచ్‌ని ఎత్తిచూపింది. బాలయ్యను చూసి సీనియర్‌ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని లెజెండ్‌ చిత్రంతో తేలిపోయింది. కేవలం ఎంటర్‌టైన్‌, ఏవో కొన్ని వంకర డైలాగ్‌లు, కొన్ని పిచ్చి వెటకారాలు ఉంటే చాలనుకుని, బ్రహ్మానందం పక్కన వీళ్ళు కూడా కామెడీగ్యాంగ్‌లా తయారై, వాళ్ళని వాళ్ళే ప్రేక్షకుల ముందు పలచన చేసేసుకున్నారు ఏ టు జెడ్‌ హీరోలందరూ. ఒకటే మూస సీనులు, డైలాగ్‌లు. ఒక ఎమోషన్‌ గానీ, ఒక టెంపో గానీ లేకుండా పిచ్చిపిచ్చిగా తయారయ్యాయి సినిమాలన్నీ. ఎవరి సినిమాకి వెళ్ళినా ఒక్కలాగే అఘోరిస్తున్నాయి. అందులో ఎక్కడా తన మార్కు ఎమోషన్‌ని మిస్‌ కాకుండా, తన హీరోయిక్‌ పంచ్‌ని వదులుకోకుండా, తన మాదిరి సినిమాటెక్‌ బ్యాలెన్స్‌ని విస్మరించకుండా ఖలేజాతో తాను నమ్మిన కథని, దర్శకుడి క్రియేటివిటీని నమ్ముతూ లెజెండ్‌ చిత్రాన్ని బాలయ్య చేశారు. తన పట్టుదలకి పూర్తి మార్కులనే కొట్టేశారు బాలయ్య. తన హిట్‌ కొట్టడమే కాకుండా, సీనియర్‌ హీరోలకి కూడా ఓ క్రేజ్‌ని, ఓ రేంజ్‌ని కట్టబెట్టారు.

యంగ్‌ హీరోల చిత్రాలు ఈ మధ్య బాక్సాఫీసుల చేత భోరుమని ఏడిపించాయి. మహేష్‌ వన్‌, రామ్‌చరణ్‌ ఎవడు, జూనియర్‌ ఎన్టీఆర్‌ దమ్ము, రామయ్యవస్తావయ్యా ఒకటి కాదు అన్నీ అంటే అన్నీ ఇంటికిళ్ళిపోయాయి. అత్తారింటికి దారేది కూడా చాలా కాలం టైమ్‌ తీసుకుని, కథని బాగా చెక్కుకున్న తర్వాత గానీ సెట్‌కి వెళ్ళలేదు. అందుకే సినిమా నిలబడింది. పరిశ్రమని నిలబెట్టింది. అటువంటి వర్క్‌ ఏ చిత్రానికీ జరగడం లేదు. బాలయ్యతో సినిమా అంటే కొంత భయమే అందరికీ. ఆయనని హేండిల్‌ చెయ్యడం కష్టమని, ఆయన ఇమేజ్‌ని ప్రస్తుతమున్న ట్రెండ్‌లోఒప్పించడం అసాధ్యమనివెనక్కి తగ్గిపోతున్నవారందరికీ దర్శకుడు బోయపాటివిఫులమైన వివరణ పత్రికాముఖంగా ఇవ్వడం ఓ మంచి గెస్చర్‌. దర్శకుడుకి తాను తీసే కథపైన కమాండ్‌ ఉంటే బాలయ్యబాబు దేనిలోనూ కలుగుచేసుకోరని క్లారిటీ ఇచ్చారు. బాలయ్యపైన అలవిమాలిన అపోహలు పెంచుకున్న, పెంచిన ప్రబుద్ధులకు లెజెండ్‌ పెద్ద చెంపపెట్టయితే, బోయపాటి ఇచ్చిన క్లారిటీ మరో చెంపదెబ్బ.