లెజెండ్ లీక్‌..!

Balakrishna-Legendఇది లీకేజీల కాలం. సినిమా బ‌య‌ట‌కు రాక మునుపై పైర‌సీ వచ్చేసి ఎగతాళి చేస్తోంది. ఇక డైలాగులూ, స‌న్నివేశాలు, పాట‌లూ అంటారా..? య‌థావిథిగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న లెజెండ్ కూడా లీకైంది. కంగారు ప‌డ‌కండి .. సినిమా కాదు.. ఓ డైలాగ్ మాత్రమే. కేవ‌లం డైలాగే అయినా ఈ సినిమా లో శ‌క్తి ఎంతో… ఈ డైలాగ్ ఒక్కటే చెప్పేస్తోంది. ఇంత‌కీ లీకైన డైలాగ్ ఎలా ఉందంటే…

సినిమాలోని ఓ పాత్ర : నేను అల‌సి పోయే వ‌ర‌కూ న‌రుక్కుంటూ వెళ్తా!
బాల‌కృష్ణ‌: నీకు న‌రుక్కొంటూ పోతే అలుపు వ‌స్తుందేమో… నాకు ఊపు వ‌స్తుంది..!

అదిరిపోయింది క‌దూ.. పౌరుషంలో కూడిన డైలాగులు చెప్పడంలో బాల‌య్యకు బాల‌య్యే సాటి. కత్తుల‌తో కాదురా, కంటిచూపుల‌తో న‌రికేస్తా ద‌గ్గర నుంచి, చూడూ ఒక వైపే చూడూ అన్నంత వ‌ర‌కూ డైలాగుల‌లో ప్రభంజ‌నం సృష్టించారు. మ‌రి లెజెండ్‌లో బాల‌య్య నోటి నుంచి ఇంకెన్ని డైలాగులు వినే అవ‌కాశం వ‌స్తుందో…?