బాలయ్య కూ బైకుల మీద మోజు పెంచుకొంటున్నాడు. రహదారులపై జామ్ జామ్ మంటూ వెళ్తూ – తన వయస్సుని మరికాస్త తగ్గించుకొంటున్నాడు. కొత్త సినిమాలోనూ బాలయ్య కోసం ఓ బైకు తీసుకొచ్చారు. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఓ సరికొత్త బైక్ ని నడపబోతున్నాడట. ఆ బైక్ ఇదే. అన్నట్టు ఈసినిమాలో బాలయ్య లుక్ కూడా చాలా బాగుంది. సింహా తరవాత ఇంత అందంగా కనిపించడం ఇదే తొలిసారి. సింహాలో బాలయ్యని అందంగా చూపించిన బోయపాటి, ఈ విషయంలో మరోసారి మార్కులు కొట్టేసేలానే ఉన్నాడు.