Site icon TeluguMirchi.com

పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా బాలయ్య..?

balakrishna-police-picsఓ “ఇన్‌ స్పెక్టర్‌ ప్రతాప్‌”, “రౌడీ ఇన్‌ స్పెక్టర్‌”, “లక్ష్మీ నరసింహ”, “చెన్నకేశవరెడ్డి” .. ఇలా పోలీస్‌ పాత్రల్లో బాలకృష్ణ కనిపించిన చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్లుగా ఘనవిజయాలు సాధించాయి. ఇప్పుడు తాజాగా మరోసారి బాలయ్య ఖాకీ డ్రెస్సులో కనువిందు చేయబోతున్నాడని తెలిసింది. అసలే బాలయ్య అంటేనే భారీ భారీ డైలాగులు గుర్తుకొస్తాయి. అందునా పోలీస్‌ పాత్ర అంటే ఇక ఆ పవర్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా “వీడుతేడా” ఫేం చిన్నికృష్ణ దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే! ఇందులో బాలకృష్ణ ఓ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నట్టు సమాచారం. త్వరలో షూటింగ్‌ ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రంలో బాలయ్య పాత్ర సరికొత్తగా , అభిమానులను థ్రిల్‌ చేసేలా ఉంటుందని ఫిలింనగర్‌ వర్గాల భోగట్టా!

Exit mobile version