ఇప్పటికే ఈ చిత్రంలో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా, డాన్‌గా కనిపిస్తాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలయ్యతో ఈ సినిమాలో కొత్త కొత్త అవతరాలు వేయించి, విభిన్నంగా బాలయ్యను చూపించేందుకు పూరి ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం రకరకాలుగా పూరి ప్లాన్స్ చేస్తున్నాడని, తన పూర్తి బాధ్యత పూరికి అప్పగించిన బాలయ్య మారు మాట్లాడకుండా, పూరిపై ఉన్న నమ్మకంతో చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్తున్నట్లుగా సమాచారం. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తానంటూ పూరి ఛాలెంజ్ చేసిన విషయం తెల్సిందే.