ఒకే వారంలో బాబాయి అబ్బాయి సినిమాలు

నందమూరి ఫ్యామిలీ హీరోలు తమ సినిమాల మద్య క్లాష్‌లు లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ సినిమాల విడుదల విషయంలో జాగ్రత్తలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా బాలకృష్ణ మరియు ఎన్టీఆర్‌ల సినిమాల విడుదల విషయం చూసినట్లయితే ఎక్కువ గ్యాప్‌ ఉండేలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈసారి మాత్రం నందమూరి బాలకృష్ణ మరియు కళ్యాణ్‌ రామ్‌ల మద్య వార్‌ తప్పేలా లేదు. వీరిద్దరు కూడా ఇప్పుడు అరాకొరా హీరోలు అని చెప్పక తప్పదు. ఎందుకంటే వీరికి సక్సెస్‌ మొహం ఎరిగి చాలా ఏళ్లు అయ్యింది. అయినా కూడా వీరిద్దరు పోటీ పడబోతున్నారు అంటూ నందమూరి ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది.

బాలకృష్ణ నటిస్తున్న ఆయన 105వ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విభిన్నమైన లుక్‌లో బాలయ్య ఆ చిత్రంలో కనిపించబోతున్నాడు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జైసింహా నిరాశ పర్చింది. అందుకే ఈ చిత్రంపై ఆశలు ఉన్నాయి. ఇక కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ఎంతమంచి వాడవురా అనే చిత్రం కూడా సంక్రాంతికి రాబోతుంది. సతీష్‌ వేగేష్నకు సంక్రాంతి సెంటిమెంట్‌ ఉంది. శతమానం భవతి చిత్రం సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. అందుకే బాలయ్య మూవీ ఉన్నా కూడా వారం గ్యాప్‌ లేకుండానే ఎంత మంచి వాడవురా చిత్రంను విడుదల చేయబోతున్నారు.