ఎన్టీఆర్ చిత్రం తర్వాత బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆ చిత్రం వినయ విధేయ రామ ఫలితం కారణంగానో లేదా మరేంటో కాని బోయపాటి దర్శకత్వంలో కాకుండా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ఈ సమయంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. నవంబర్లో బాలయ్య 106వ చిత్రం బోయపాటి దర్శకత్వంలో ప్రారంభం కాబోతుంది.