బోయపాటిపై బాలయ్య మనసు మార్చుకున్నాడా?

వినయ విధేయ రామ చిత్రం ఫలితం మెగా ఫ్యాన్స్‌ కలలో కూడా ఊహించుకోలేదు. రామ్‌ చరణ్‌కు మరో హిట్‌ వస్తుందనుకుంటే ఆ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ మరియు కొన్ని ముఖ్యమైన సీన్స్‌ మరీ దారుణంగా ఉండటంతో ప్రేక్షకులు మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్‌ కూడా సినిమాపై ట్రోల్స్‌ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను కావాలనే మరీ ఇంత దారుణమైన చెత్త సినిమాను చరణ్‌తో చేశాడనే విమర్శలు కూడా వచ్చాయి. ఇంతగా విమర్శలు మూట కట్టుకోవడంతో బోయపాటితో సినిమాలు చేసేందుకు ఏ హీరో కూడా ముందుకు రాలేదు.

ఎన్టీఆర్‌ చిత్రం తర్వాత బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆ చిత్రం వినయ విధేయ రామ ఫలితం కారణంగానో లేదా మరేంటో కాని బోయపాటి దర్శకత్వంలో కాకుండా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తన కొత్త సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యింది. ఈ సమయంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. నవంబర్‌లో బాలయ్య 106వ చిత్రం బోయపాటి దర్శకత్వంలో ప్రారంభం కాబోతుంది.