#బాలయ్య105 కొత్త సమాచారం

నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రాన్ని తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంభినేషన్‌లో వచ్చిన ‘జై సింహా’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఈ చిత్రంను చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం షూటింగ్‌ను థాయిలాండ్‌లో జరపడం జరిగింది.

తాజాగా థాయిలాండ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. థాయిలాండ్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్స్‌ను కూడా చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. రెండు వారాలు గ్యాప్‌ తీసుకుని హైదరాబాద్‌లోని ఒక సెట్‌లో షూట్‌కు రెడీ అవ్వబోతున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సోనాల్‌ చౌహాన్‌ మరియు వేదికలు నటిస్తున్నారు. ఇక కీలక పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ మరియు భూమికలు నటించబోతున్నారు. బాలయ్య గత కొంత కాలంగా సక్సెస్‌ లేక ఢీలా పడిపోయాడు. మరి ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.