నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇంకా సినిమాకు టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఇటీవలే వినాయక చవితి సందర్బంగా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను విడుదల చేయడం జరిగింది. థాయిలాండ్‌లో రెండు పాటలతో పాటు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. దాంతో అక్కడ పూర్తి అయ్యింది. వారం రోజుల క్రితమే ఇండియాకు వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు తదుపరి షెడ్యూల్‌కు సిద్దం అవుతున్నారు.
రేపటి నుండి చిత్రం రెండవ షెడ్యూల్‌ను చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొన్ని డ్రామా సీన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించినేందుకు ఏర్పాట్లు చేశారు. రేపటి నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం షూట్ జరుగనుంది. బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. మూడు లేదా నాలుగు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని తెలుస్తోంది. వేదిక మరియు సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.