అభిమానం కొంటే వచ్చేది కాదు: బాలయ్య

balakrishna‘అభిమానం డబ్బుతో కొంటే వచ్చేది కాదు. గుండెలోతుల్లోంచి పెల్లుబికి వచ్చేది. ఇంతమంది అభిమానాన్ని పొందగలగడం నా పూర్వజన్మ సుకృతమని అభిమానులను ఉద్దేశించి బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లెజెండ్’. ఈ చిత్రం ఆడియో శిల్పకళావేదికలో శుక్రవారం నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి ట్రైలర్‌ను విడుదల చేయగా , శ్రీనువైట్ల తొలి సీడీని ఆవిష్కరించగా మరో దర్శకుడు బి.గోపాల్ స్వీకరించారు. తొలిసారి బాలకృష్ణ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, జగపతిబాబు, బోయపాటి శ్రీను, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేష్, భరత్, బ్రహ్మానందం, ఆలీ, ప్రసాద్.వి.పొట్లూరి, అంబికా కృష్ణ తదితరులు హాజరయ్యారు.