నందమూరి బాలకృష్ణ విజయాల ముచ్చట పక్కన పెడితే వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈయన ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత బోయపాటి దర్శకత్వంలో నటించనున్నాడు అని వార్తలు ప్రచారం అయ్యాయి. కాగా తాజా సమాచారం ప్రకారం బాలయ్య తదుపరి చిత్రం పూరీ దర్శకత్వంలో ఉండనుంది. పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే బాలయ్య సినిమా పనులను మొదలెట్టనున్నాడు.
బాలయ్య, కె ఎస్ రవికుమార్ కాంబో చిత్రీకరణ చకాచకా జరుగుతోంది. ఈ చిత్రంలో బాలయ్య పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. గతంలో చాలా చిత్రాల్లో పోలీస్‌గా కనిపించి మంచి సక్సెస్‌లను సాధించాడు. పూరీ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కూడా బాలయ్య పోలీస్‌గానే దర్శణం ఇవ్వనున్నాడు. దాంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హీరోల గెటప్‌లలో వైవిధ్యత చూపించే పూరీ బాలయ్యను కూడా కొత్త లుక్‌కి మార్చుతాడని అభిమానులు ఆశించారు. కానీ రెగ్యులర్‌గా చేసే పోలీస్ పాత్ర అనగానే కాస్త నిరాశపడుతున్నారు. అయితే కథ బాగుంటే ఏ పాత్ర అయినా కూడా అభిమానులకు నచ్చుతుందనేది పూరీ నమ్మకం.