కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ ను అందుకున్నాడు. అంతేకాదు చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందంటే మాములు విషయం కాదు. నటుడు ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన జంటగా నటించిన ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈసినిమా అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లగొడుతుంది.
ఇటీవలే ఉక్రెయిన్‌లో జరిగిన ఓంక్యో ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం తాజాగా మరో 4 అవార్డులను గెలుచుకుంది. అమెరికా వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో నాలుగు కేటగిరీల కింద బలగం సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ ఫ్యూచర్ డైరెక్టర్ గా వేణుకు, బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ ఫ్యూచర్ కేటగిరీ కింద హీరో ప్రియదర్శికి.. బెస్ట్ యాక్టరస్ ఇన్ ఏ ఫ్యూచర్ కేటగిరీ కింద హీరోయిన్ కావ్య కల్యాణ్ రాంకు, బెస్ట్ నేరేటివ్ ప్యూచర్ కేటగిరీ లో డైరెక్టర్ వేణుకు ఈ అవార్డ్స్ వచ్చాయి. ఈ అవార్డులతో చిత్రయూనిట్ చాలా సంతోషంగా వుంది. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి మరియు హన్షిత రెడ్డి నిర్మించారు.
#Balagam does it big again! 🤩🔥
The film has won four awards in the following categories:
Best Feature Director
Best Actor in a Feature
Best Actress in a Feature
and Best Narrative Feature#BalagamGoesGlobal pic.twitter.com/1EM9wTZ7SR— Dil Raju Productions (@DilRajuProdctns) April 3, 2023