దాంతో చేసేది లేక రాజమౌళి కన్నడ భాషలో మాట్లాడి మరీ కన్నడ ‘బాహుబలి’ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన కట్టప్ప సత్యరాజ్ కూడా కన్నడిగులను ఒప్పించే ప్రయత్నం చేశాడు. గతంలో తాను కావేరి నదీ జలాల విషయంలో కన్నడ వారిని బాదపెట్టే విధంగా మాట్లాడానని, అందుకు క్షమాపణలు కూడా తెలిపాడు. తాను చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగానే ఉన్నాయని కట్టప్ప తన తప్పును ఒప్పుకున్నాడు. సత్యరాజ్ స్వయంగా సారీ చెప్పడంతో కన్నడలో ‘బాహుబలి’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. కట్టప్ప వెనక్కు తగ్గి సారీ చెప్పడం వల్లనే కన్నడిగులు విడుదలకు ఒకే చెప్పారు. కన్నడలో కూడా ఇతర భాషలతో పాటే ఈ నెల 28 విడుదల కానుంది.