‘బాహుబలి 2’ విజయం ప్రభాస్‌ది కాదు: దర్శకుడు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి 2’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యికోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ సైతం ‘బాహుబలి 2’ని తెగ పొగిడేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి ఈ చిత్రంపై స్పందించాడు. ‘బాహుబలి 2’ విజయం ప్రభాస్‌ది కాదు అంటూ గట్టిగా వాదించాడు. ఈ విజయం దర్శకుడి కథ, స్క్రిప్టుదే, అంతేకానీ ప్రభాస్‌ పాపులారిటీ వల్లనే ఈ చిత్రం ఇంత హిట్‌ కాలేదు అది కేవలం దర్శకుడి పని తీరు వల్లనే ఈ విధంగా విజయ భేరి మోగిస్తుంది అంటూ రోహిత్‌ శెట్టి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు.

‘బాహుబలి 2’ చిత్ర ప్రమోషన్‌లను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. బాలీవుడ్‌లో అయితే సినిమా ప్రమోషన్‌ల కోసం చాలా ఖర్చు చేస్తారు. లైవ్‌ షోలకు వెళుతుంటారు, షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లి సందడి చేస్తారు కానీ ‘బాహుబలి 2’ చిత్రం అదంతా వృధా అని నిరూపించింది. కేవలం ప్రమోషన్‌ వల్ల సినిమాలు హిట్‌లు కావు, అది కథ మీద ఆధారపడి ఉంటాయి అని రోహిత్‌ శెట్టి చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి 2’ని చూసి బాలీవుడ్‌ ఇండస్ట్రీ చాలా నేర్చుకోవాల్సి ఉంది అని అంటున్నాడు. అంతేకాకుండా అవకాశం ఉంటే ప్రభాస్‌తో ఒక సినిమా చేయాలని ఉందని, అది త్వరలో నెరవేరితే బాగుండు అని రోహిత్‌ శెట్టి అంటున్నాడు.