Site icon TeluguMirchi.com

బాహుబ‌లికి ముహూర్తం ఖ‌రారు

Bahubali_2013హ‌మ్మయ్య‌… బాహుబ‌లి ఇంత‌కాలానికి సెట్స్‌ పైకి వెళ్లబోతోంది. ఈనెల 14 నుంచి న‌గ‌ర శివార్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్‌ ని నిర్మించారు. అక్కడే సింహాభాగం ఈ సినిమాని తెర‌కెక్కిస్తారు. దాదాపు 75 శాతం స‌న్నివేశాల‌ను బ్లూమేట్‌ లో షూట్ చేస్తారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం భారీ స్థాయిలో ఖ‌ర్చు పెట్టబోతున్నారు. ఇదో చారిత్రక గాథ. భార‌తీయ చ‌రిత్రలో… గొప్ప వీరుడి క‌థ‌ని తీసుకొని… దానికి సినిమాటిక్ స‌న్నివేశాలు జోడించి తెర‌కెక్కిస్తున్నారు రాజ‌మౌళి. దాదాపు రూ.100 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. ఈ సినిమా పూర్తయ్యే స‌రికి ఈ బ‌డ్జెట్ మ‌రింత పెరిగే అవ‌కాశాలున్నాయి.

Exit mobile version