రెండో టీజ‌ర్ రెడీ

bahubali-movie-first-look-posterబాహుబ‌లి… టాలీవుడ్‌లో ఇద్దరు సినిమా వాళ్లు క‌లిస్తే… త‌ప్పకుండా ఈ సినిమా పేరు ప్రస్తావించ‌కుండా ఉండ‌రేమో..? బాహుబ‌లి బ‌డ్జెట్, బాహుబ‌లి కాస్టింగ్‌, బాహుబలి టీజ‌ర్‌… ఇలా ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం అయినా అది సన్సేష‌నే అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ స్వీట్ న్యూస్ తెలిసింది. త్వర‌లోనే బాహుబ‌లి రెండో టీజ‌ర్ రాబోతోంది. అవును….! ఇటీవ‌ల ప్రభాస్ పుట్టిన రోజున బాహుబ‌లి మేకింగ్ టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. అది యూ ట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా… దానిపై కాపీ అనే ముద్ర ప‌డింది. దానిపై నిర్మాత శోభుయార్ల గ‌డ్డ స్పందించి ట్విట్టర్లో ఓ ప్రక‌ట‌న ఇచ్చేంత వ‌ర‌కూ సాగింది వ్యవ‌హారం. ఇప్పుడు రాజ‌మౌళి రెండో టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. ఈసారి మాత్రం త‌న పూర్తి స్థాయి ముద్ర చూపించే ప్రయ‌త్నం చేస్తున్నట్టు తెలిసింది. దానికి తోడు శోభు కూడా ట్విట్టర్లో.. ”బాహుబ‌లి స్వీట్ టీజ‌ర్ వ‌స్తోంది. అభిమానులూ గెట్ రెడీ..” అంటూ ఓ సందేశం పంపాడు. ఇంకేముంది…? ప్రభాస్ అభిమానులూ సిద్ధమైపోండి..!