Site icon TeluguMirchi.com

‘కాటమరాయుడు’లో బాహుబలి సందడి!

katamarayudu songపవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, డాలీ దర్శకత్వంలో నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్లను రాబట్టడంలో దూసుకుపోతుంది. పవన్‌ నటించిన ఈ చిత్రంలో శృతిహాసన్‌ రొమాన్స్‌ చేసింది. పవన్‌, శృతిలు గతంలో ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో రొమాన్స్‌ చేసి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు.

తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ జంట సక్సెస్‌ను అందుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్‌ పేరు అవంతిక. ప్రేమంటే, ఆడాళ్లు అంటే పెద్దగా ఆసక్తి ఉండని కాటమరాయుడు ఈ చిత్రంలో అవంతిక ప్రేమలో పడతాడు. అవంతికతో ప్రేమలో పడడానికి కాటమరాయుడి సోదరులే సహాయం చేస్తారు.

జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన తమన్నా పాత్ర పేరు కూడా అందులో అవంతిక. ఆ చిత్రంలో అవంతిక పేరుకు మంచి స్పందన వస్తోంది. ఆ పేరునే పవన్‌ ఈ చిత్రంలో వాడడం విశేషం. ఆ సక్సెస్‌, బ్లాక్‌ బస్టర్‌ చిత్ర హీరోయిన్‌ పేరును ఈ హిట్‌ చిత్రంలో కూడా వాడడంతో అవంతిక పేరుకు ‘కాటమరాయుడు’లో కూడా మంచి స్పందన వస్తోంది.

థియేటర్‌లో అవంతిక పేరు వినబడగానే పవన్‌ అభిమానులు ఈలలు వేస్తూ గోలలు చేస్తున్నారు. ఆ ఈలల మోతకు థియేటర్ల టాప్‌ లేచిపోయేలా ఉంది అన్నట్టు థియేటర్‌ మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. మొత్తానికి ‘కాటమరాయుడు’ చిత్రంలో అవంతిక పేరుతో ‘బాహుబలి’ సందడి అంతా ఇంతా కాదు అని చెప్పవచ్చు.

Exit mobile version