‘బాహుబలి 2’పట్ల గుణశేఖర్‌ తీరుపై అభిమానుల ఆగ్రహం

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి, భారీ అంచనాల నడుమ విడుదలైన 2బాహుబలి 2’ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి 2’ను పొగిడిన సినీ ప్రముఖుల జాబితా చాలానే ఉంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకుడు గుణశేఖర్‌ స్పందించాడు. ఈ చిత్రాన్ని చూసిన గుణశేఖర్‌ ఒక లేఖ ద్వారా ‘బాహుబలి 2’ టీంకు అభినందనలు తెలిపారు. ఆ లేఖను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కీరవాణి అందించిన సంగీతం చాలా బాగుంది అని, రాజమౌళి విజువల్‌ వండర్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయని గుణశేఖర్‌ ఆ లేఖలో పేర్కోన్నాడు. అంతేకాకుండా ఒక మామూలు కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించడం చాలా గ్రేట్‌ అని రాజమౌళిని ప్రశంసించాడు.

గుణశేఖర్‌ ప్రశింసించినందుకు బాగానే ఉంది కానీ ‘బాహుబలి’ కథను ఒక మామూలు కథ అని అనడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అందించిన ఈ కథ మరియు అందులోని పేర్లు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎంతో ప్రత్యేకమైన ఈ కథను ఒక మామూలు కథ అని గుణ శేఖర్‌ అనడం ఏం బాలేదు అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ గొప్ప చిత్ర కథను మామూలు కథ అనడంతో ప్రస్తుతం అది నెట్‌లో చాలా వైరల్‌ అవుతోంది.