టాలీవుడ్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి మొదటి పార్టు విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా కూడా క్రేజీ చిత్రంగా మారింది ‘బాహుబలి’. ఈ చిత్ర రెండో పార్టు కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ‘బాహుబలి 2’ పేరే వినిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ‘బాహుబలి 2’ ఫీవర్ ఓ రేంజ్లో కొనసాగుతుంది. విడుదలకు రెండు రోజులే ఉన్న సమయంలో ఈ చిత్రంలోని కొత్త కొత్త స్టిల్స్ నెట్లో దర్శణం ఇస్తున్నాయి. ఆ స్టిల్స్‌ను చూసి యూనిట్ సభ్యులు గాబారా పడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిన్న విషయం కూడా బయటకు తెలియకుండా ఒట్టు పెట్టుకున్న యూనిట్ సభ్యులు లీకవుతున్న స్టిల్స్‌ను చూసి భయపడిపోతున్నారు.
ఇంతకీ ఈ స్టిల్స్ ఎక్కడి నుండి లీకవుతున్నాయి అనే విషయం యూనిట్ సభ్యులకు చెమటలు పట్టిస్తుంది. ఈ నిర్వాకం అంతా కూడా సెన్సార్ కార్యక్రమం అప్పటిదే అని యూనిట్ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాగు యూనిట్ నుండి చిన్న హింట్ కూడా లీక్ కాదు, అలాంటిది ఆశమాషిగా ఈ స్టిల్స్‌ను లీక్ చేయడం యూనిట్ సభ్యుల పని కాదు. సెన్సార్ కార్యక్రమాలప్పుడే ఎవరో కావాలని షాట్స్ తీసి వాటిని నెట్లో అప్లోడ్ చేస్తున్నారని సినీ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. అయినా ఈ భారీ చిత్రానికి ఎన్ని లీకులు వచ్చినా కూడా ఏం చేయలేదు, అది ‘బాహుబలి’ స్టామినా అని అభిమానులు ధైర్యంగా ఉన్నారు.