Site icon TeluguMirchi.com

థియేటర్స్ లలో సందడి చేయబోతున్న బాహుబలి 2 ట్రైలర్..

srk-reeasదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2 ఫై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు..ఈ మూవీ కి సంబదించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చిన ఆ రోజంతా ఆ విషయం హాట్ టాపిక్ గా మీడియా లో చక్కర్లు కొడుతుంది..తాజాగా అలాంటి వార్తే ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది.

బాలీవుడ్ బాద్షా నటించిన ‘రయీస్’ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇక ఈ చిత్రం తో పాటు బాహుబలి-2 థియేటర్ ట్రైలర్ విడుదల కానున్నదని సమాచారం బాలీవుడ్ లో ఊపందుకుంది. బాహుబలి పార్ట్ వన్ హిందీలో మంచి సక్సెస్ కావడంతో పార్టు టూ పట్ల అక్కడ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యం లో రయీస్ సినిమా ఇంటర్వెల్ సమయంలో బాహుబలి -2 థియేటర్ ట్రైలర్ ను ప్రదర్శించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియదు కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ట్రైలర్ ఫై ఆసక్తి గా ఉన్నారు. మరో పక్క నిన్నటితో బాహుబలి షూటింగ్ కు గుడ్ బై చెప్పాడు ప్రభాస్..ప్రభాస్ కు సంబదించిన షూటింగ్ అంత పూర్తి అవడం తో అతడికి బై బై చెప్పాడట రాజమౌళి.

Exit mobile version