‘బాహుబలి 2’ విడుదల రేపు కాదు… నేడే విడుదల

bahubaliటాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి బెనిఫిట్‌ షోలు వేయొద్దు అని, బెనిఫిట్‌ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో పాటు ఈ రోజు రాత్రి 9గంటలకు పెయిడ్‌ ప్రివ్యూలు వేసుకునే వెసలు బాటు కల్పించారు. అంటే ఒకరోజు ముందే, నేటి సెకండ్‌ షోకే తెలంగాణలో ‘బాహుబలి 2’ ప్రదర్శితం కానుంది. ఇదేదో బాగుందని ఏపీ డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు రాత్రి 9గంటలకే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా అనుకున్న సమయాని కంటే ఒకరోజే ముందే ‘బాహుబలి 2’ విడుదలయితే బాగుంటుంది అని ఏపీ, తెలంగాణలో ఈ రోజు రాత్రికే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ పెయిడ్‌ ప్రివ్యూల టికెట్ల కోసం అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. ఫ్యాన్సీ రేటుకు టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇకపోతే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ‘బాహుబలి 2’ చిత్రం ఈ రోజే విడుదల కాబోతుంది. సెలబ్రిటీల కోసం ముంబయిలో ‘బాహుబలి 2’ ప్రివ్యూని ఈ రోజే ప్రదర్శిస్తున్నారు. ముందుగా అనుకున్న ఏప్రిల్‌ 28 కంటే 27నే ‘బాహుబలి 2’ చిత్రం విడుదల కాబోతుంది. ‘బాహుబలి 2’ విడుదల రేపు కాదు నేడే అనగానే అభిమానులు ఎలాగైనా సరే టికెట్లను రాట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ స్టోరీ ఈ రోజే తెలిసిపోతుంది.