Site icon TeluguMirchi.com

ఇండియాలోనే మొదటి స్థానంలోకి ‘బాహుబలి 2’ వచ్చేస్తోంది

అత్యధిక వసూళ్లను రాబట్టి ఆల్‌టైం ఇండియా టాప్‌ 10 గ్రాసర్‌గా నిలిచిన చిత్రాలలో మొదటి స్థానంలోకి బాహుబలి రాబోతుంది. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన ‘పీకే’ చిత్రం 740కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. ‘బాహులి 2’ చిత్రం విడుదలైన నాలుగో రోజుకే 600కోట్లను సాధించి మూడో స్థానానికి దగ్గరగా ఉంది. ఇకపోతే మొదటి స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయమేమి పట్టదు అని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఒక తెలుగు చిత్రం ఈ రేంజ్‌లో వసూలు చేసి టాప్‌ 10లో నిలవబోతుంది అంటే అంతా షాకవుతున్నారు.

రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుండి అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయి. అందుకు తగ్గట్టు రాజమౌళి ‘బాహుబలి 2’ను తెరకెక్కించి చాలా పవర్‌ఫుల్‌ పాత్రలను సృష్టించి కేవలం తొగులోనే కాకుండా విడుదలయిన అన్ని భాషల్లో కూడా కలెక్షన్ల వరద పారించేలా ‘బాహుబలి’ని సృష్టించాడు. కలెక్షన్ల విషయంలో ఫుల్‌ జోరు మీదున్న ‘బాహుబలి 2’ చిత్రం మొదటి స్థానంలోకి చాలా తక్కువ సమయంలోనే వచ్చేస్తోంది. తాజాగా విడుదలైన ‘బాహుబలి 2’ చిత్రం భారతదేశ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

Exit mobile version