థియేటర్ల విషయంలో బాహుబలి ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యేనా!

Umar-review-baahubali2తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్ర రెండో పార్టు విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో సినీ పరిశ్రమలోనే కాకుండా ఎక్కడ చూసినా కూడా ‘బాహుబలి’ పేరే వినిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా టాక్‌ ఎలా ఉంటుందో కానీ రాజమౌళి విజువల్‌ వండర్స్‌ కోసమే చాలామంది ‘బాహుబలి 2’ చూడాలనుకుంటున్నారు. టాక్‌ ఎలా ఉన్నా కూడా ‘బాహుబలి’కి భారీ ఓపెనింగ్స్‌ వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర యూనిట్‌. అందుకే తెలుగు రాష్ట్రాలో ఇప్పటికే అదనపు షో కోసం అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఏపీలో ఆరు షోలు, తెలంగాణలో 5 షోలకు అనుమతులు వచ్చేశాయి.

ఏప్రిల్‌ 28న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 7000స్క్రీన్‌లలో విడుదల చేయాలని ‘బాహుబలి’ టీం ప్లాన్‌ చేస్తుంది. మనదేశంలో ఇంతవరకు ఏ పెద్ద చిత్రమైనా కూడా 5000 స్క్రీన్‌ల కంటే ఎక్కువ విడుదల కాలేదు. ఎందుకంటే మనదేశంలో అంతకంటే ఎక్కువ థియేటర్‌లు లేవు కాబట్టి. మరీ జక్కన్న మాత్రం ఏకంగా 7000 స్క్రీన్‌లలో విడుదల చేయాలని భావిస్తున్నాడు. ట్రేడ్‌ వర్గాల వారు మాత్రం ఎంత చేసినా కూడా ‘బాహుబలి 2’ 5000 స్క్రీన్‌లలో మాత్రమే విడుదల అవుతుంది అని అంచనా వేస్తున్నారు. 7000 స్క్రీన్‌లలో విడుదల అయ్యే విధంగా ‘బాహుబలి’ టీం ఏమైనా ప్లాన్‌ చేస్తుందా..?? అది ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.