ఇక హైదరాబాద్ లోనే ‘బాద్ షా’ వార్

Badshah team to return to Hyderabadఎన్.టి.ఆర్, కాజల్ నటిస్తున్న ‘బాద్షా’ చిత్రం యూరప్ షెడ్యూల్ ను ముగించుకుంది. ఈ షెడ్యూల్ లో రెండు పాటలను ఎన్.టి.ఆర్ – కాజల్ ఫై చిత్రీకరించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మిగతా సన్నివేశాలను హైదరాబాద్లోనే చిత్రీకరించనున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ హాట్ హాట్ గా జరుగుతోంది. ఈ విషయమై నిర్మాత బండ్ల గణేష్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పటికే నెల్లూర్ రైట్స్ ని శ్రీ నికేతన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నామని కన్ఫర్మ్ చేసారు. గబ్బర్ సింగ్ కు కూడా మొదట వారే డిస్ట్రిబ్యూటర్ గా కన్ఫర్మ్ చేసారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా’ చిత్రానికి పని చేస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిచిన బాద్షా ఆడియో మార్చ్ 10న ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.