యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో యువీ క్రియేషన్స్ , గోపికృష్ణ బ్యానర్ లు సంయుక్తం గా నిర్మిస్తున్న మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా జార్జియా షెడ్యూల్ పూర్తీ చేసుకొని ఇండియా కు వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ కు మాత్రం స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిత్ర సీమా లాక్ డౌన్ ప్రకటించింది.
ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ కు మరింత ఆలస్యం కానుందని సమాచారం. మొన్నటివరకు 2021 సంక్రాంతి బరిలో ఈ సినిమాను తీసుకరావాలని అనుకున్నప్పటికీ..ప్రస్తుతం షూటింగ్ లు బంద్ కావడం..ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్పడం కూడా కష్టంగా ఉండడం తో సంక్రాంతి కి సినిమా రావడం కష్టం అని చిత్ర యూనిట్ తేల్చారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారట.