Site icon TeluguMirchi.com

గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవరు కొట్టలేరు.. ‘బేబీ’ ట్రైలర్


ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ ‘బేబీ’. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో ‘బేబీ’ అనే సినిమా రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ట్రైలర్ ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ట్రైలర్ ఆరంభంలో ‘మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి వుంటుంది’ అనే లైన్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ తర్వాత స్కూల్లో ఓ అమ్మాయి, అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇష్టపడతారు. అయితే పై చదువులకు కాలేజ్ లో చేరిన ఆ అమ్మాయి మరో అబ్బాయితో ప్రేమలో పడుతుంది. తర్వాత వీరి మధ్య ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందనేది కథ. ఇకపోతే “తిరిగి కొట్టేంత బలం లేదనేగారా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకపోవచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవరు కొట్టలేరు” అంటూ చివర్లో అమ్మాయి చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది.

Baby Theatrical Trailer | Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin | Sai Rajesh | SKN

Exit mobile version