వినూత్న రీతిలో ‘బేబీ’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..


ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లు కలిసి నటించిన మూవీ ‘బేబీ’. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ‘బేబీ’ సినిమా జూలై 14న విడుదల కానుంది. ఇదే విషయాన్ని ప్రసాద్ ఐ-మాక్స్ దగ్గర దాదాపు 70 అడుగుల విడుదల తేదీ పోస్టర్ తో ప్రకటించారు చిత్రయూనిట్. ఈ చిత్రం టీజర్ మరియు సాంగ్స్ లాగానే కొత్త పోస్టర్ డిఫరెంట్ గా సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.

ఈ విడుదల తేదీ పోస్టర్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవిచైతన్య లతో పాటు ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అలానే ఈ సినిమా నిర్మాత ఎస్ కే ఎన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ అటెండ్ అయ్యారు. ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీ తో అందరికీ నచ్చే అంశాలతో జూలై 14న ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది టీమ్. అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో, ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు, అలానే ఈ చిత్ర ప్రమోషన్స్ని ఇక జోరుగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.