ప‌వ‌న్‌ కి మ‌ళ్లీ తిక్కరేగుతోంది

gabbar_singh2‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటూ గ‌బ్బర్‌ సింగ్‌ లో రెచ్చిపోయాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ తిక్క మ‌ళ్లీ రేగ‌నుంది. అదేనండీ… గ‌బ్బర్‌ సింగ్ 2 మొద‌లుకాబోతోంది. సంప‌త్ నంది ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. జూన్‌ లో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంద‌ని స‌మాచార‌మ్‌. ఈ యేడాది సినిమా పూర్తి చేసి సంక్రాంతి బ‌రిలో ఈ సినిమాని దింపాల‌ని ప‌వ‌న్ ప్లాన్‌! ఈ చిత్రానికి ప‌వ‌న్ నిర్మాత‌గా కూడా వ్యవ‌హ‌రించ‌నున్నాడు. స్టోరీ, స్ర్కీన్‌ ప్లే విష‌యాల్లోనూ త‌న స‌హ‌కారం అందిస్తాడ‌ట‌.