కొడైకెనాల్ సేద తీరుతున్న బాబాయ్ -అబ్బాయిలు….

rana-venkiవేసవి కాలం వచ్చిందంటే చాలు, చాల మంది సెలబ్రిటీస్ తమ ఫ్యామిలీ తో కలిసి మండే ఎండలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. మరికొంత మంది వేసవి సేద తీర్చుకోడానికి విదేశాలకు పయనవుతారు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ కూడా వేసవి ట్రిప్ వేసింది.

వేసవి తాపానికి దూరంగా హాయిగా ఫ్యామిలీ తో గడపడం కోసం కొడైకెనాల్ ప్లేస్ ని ఎంచుకున్నారు. ఈ న్యూస్ స్వయనా రానా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. బాబాయ్ వెంకి తో కలిసిన సెల్ఫీ పిక్ తీసి దాన్ని సోషల మీడియా లో తెలపడం తో అందరికి తెలిసింది. ప్రస్తుతం రానా బాహుబలి చిత్రం లో నటించాడు. అలాగే బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.