బాహుబలి 2 ఆరు రోజుల కలెక్షన్ల వివరాలు..

ప్రభాస్ , రానా , అనుష్క నటించిన బాహుబలి 2 ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది..విడుదలై ఐదు రోజులు కావొస్తున్నా ఇంకా టికెట్స్ దొరకని పరిస్థితి అంటే సినిమా ఏ రేంజ్ లో నడుస్తుందో అర్ధం చేసుకోవచ్చు..రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ కు జనాలు బ్రహ్మ రధం పడుతున్నారు. అన్ని చోట్ల విపరీతమైన కలెక్షన్స్ రాబడుతూ ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ఈ ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలా వసూళ్లు చేసిందో మీరే చూడండి..

నైజాం —> రూ. 32.09 కోట్లు
సీడెడ్లో —> రూ. 19. 05 కోట్లు
నెల్లూరు—> రూ. 4. 33 కోట్లు
గుంటూరు—> రూ. 11. 44 కోట్లు
కృష్ణా—> రూ. 7. 87 కోట్లు
వెస్ట్ గోదావరి—> రూ. 9. 01 కోట్లు
ఈస్ట్ గోదావరి—> రూ. 11. 45 కోట్లు
ఉత్తరాంధ్ర—> 14. 05 కోట్లు

మొత్తంగా రూ. 109. 29 కోట్ల షేర్ ను బాహుబలి సొంతం చేసుకుంది.