Site icon TeluguMirchi.com

బాహుబలి టికెట్స్ ఆన్లైన్ లేవు -లైన్ లో దొరకవచ్చు..

Baahubali-Tickets-ONLINEఓ సినిమా కోసం యావత్ ప్రపంచం ఇంతలా ఎదురుచుస్తుందా అనే సందేహం వచ్చేలా బాహుబలి చిత్ర రిలీజ్ కోసం అందరు ఎదుచుస్తున్నారు. తాజాగా బాహుబలి టికెట్స్ కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి – ప్రభాస్ రేంజ్ ఏమిటన్నది తాజాగా మరోసారి వెల్లడైంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 వేల థియేటర్స్ లలో గ్రాండ్ రిలీజ్ అవుతుందనే విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని ఆర్క్ మీడియా ద్వారా విడుదల అవుతుంది. అయితే బాహుబలి మూవీకి సంబంధించిన ఆన్ లైన్ బుకింగును ఈరోజు ఉదయం ప్రారంభించగా, కొన్ని నిమిషాల్లోనే మొదటి 3 రోజులకి సంబంధించిన టికెట్స్ అన్నీ హాట్ కేకుల అమ్ముడు పోయాయి. అంతే కాకుండా ధియేటర్ల వద్ద ఇస్తున్న అడ్వాన్సు బుకింగ్ సైతం ఇప్పటికే క్లోజ్ అయింది. దీంతో మూడు రోజుల సబందించిన షోస్ కు సంబంధించిన టికెట్స్ అన్నీ సేల్ అయిపోయాయని సమాచారం.

దీంతో రాజమౌళికి వస్తున్న ఈ డిమాండు చూసి యవతు సినీ మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే బాక్సాపీస్ లెక్కలు వేయడం స్టార్ట్ చేసారు. ఇక ఈ చిత్రం మొత్తం నాలుగుభాషలలో ప్రక్షకుల ముందు రాబోతుంది. ఇండియా సిల్వర్ స్క్రీన్ ఫై మునుపెన్నడూ రానటువంటి చిత్రగా బాహుబలి రాబోతుంది.

Exit mobile version