ఐటీ శాఖకు 1500 టికెట్ లు ముట్టజెప్పారట ..

ఐటీ శాఖా అంటే ధనవంతులకు వణుకు..ఇక సినిమా వాళ్లకు అయితే చెప్పనవసరం లేదు..అందుకే ఐటీ అధికారులపై ఎప్పుడు ఓ కన్నేసి ఉంటారు. ఇక పెద్ద సినిమా రిలీజ్ విషయం లో ఆ శాఖలో పనిచేసే వారికీ ఫ్రీగా టికెట్స్ ఇస్తుంటారు..ఇక బాహుబలి లాంటి విషయానికి వస్తే చెప్పనవసరం లేదు..ఆ మధ్య బాహుబలి చిత్ర నిర్మాతల ఫై ఐటీ అధికారులు దాడి చేసిన సంగతి తెల్సిందే..అందుకే కాబోలు ఎవరికీ దొరకని టికెట్స్ వారికీ పెద్ద సంఖ్యలో ఇచ్చారట.

దాదాపు మొదటి రెండు రోజులకు గాను ఐటీ అధికారులకు దాదాపు 1500 టికెట్స్ ముట్టజెప్పారని వినికిడి.ఎవరి ద్వారా వెళ్లాయి? ఎవరికి వెళ్లాయి? ఎలా వెళ్లాయి? అన్నది తెలియదు కానీ, మొత్తం మీద మొహమాటం టికెట్ లు సింహభాగంగా 1500 టికెట్ లు ఆ శాఖ జనాలకే అందాయని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు రాజకీయ నాయకుల నుండే కాక సినిమా ఇండస్ట్రీ , పోలీస్ శాఖా , ప్రభుత్వ అధికారుల నుండి థియేటర్స్ యాజమాన్యాలకు విపరీతమైన ఒత్తిడి ఏర్పడిందట..అందుకే మల్టీ ఫ్లిక్స్ థియేటర్స్ లలో సాధారణ ప్రేక్షకులకు టికెట్స్ దొరకలేదు.