Site icon TeluguMirchi.com

థియేటర్స్ దగ్గర సంక్రాంతి సందడి మొదలయ్యింది..


సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకే కాదు సినిమా వాళ్ళ కూడా ఎంతో ఇష్టం.. సంక్రాంతి టైం లో ఏ సినిమా రిలీజ్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించాల్సిందే..అందుకే ప్రతి ఒక్క పెద్ద హీరో సంక్రాంతి టైం లో తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు..ఇక గత నెల రోజులుగా థియేటర్స్ అన్ని జనాలు లేక బోసిపోయాయి..ఇప్పుడు బాహుబలి వల్ల మళ్లీ సంక్రాంతి సీజన్ థియేటర్స్ దగ్గర కనిపించింది..

చిన్న , పెద్ద ఏ థియేటర్ చూడు ప్రేక్షకులతో కిక్కిరిపోతున్నాయి..ఈ జన ప్రభంజనం వారం రోజుల పాటు ఏ మాత్రం తగ్గదని తెలుస్తుంది..దీంతో క్యాంటీన్లు, పార్కింగ్ స్టాండ్ లు కళకళ లాడతాయి. ఇక ఇదే అదును చేసుకొని థియేటర్ యాజమాన్యం బ్లాక్ టికెట్స్ దందా మొదలు పెట్టాయి..ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది భారీ లెవల్లో టికెట్స్ దండుకుంటున్నారని వినికిడి..మొత్తం మీద బాహుబలి చిత్రం వల్ల థియేటర్స్ అన్ని కళకళలాడడం సినిమా ఇండస్ట్రీ కి మంచి పరిమాణం.

Exit mobile version