Site icon TeluguMirchi.com

రూ. 1000 కోట్ల క్లబ్ లో బాహుబలి 2 .


తెలుగు సినిమా కు ఇంతకన్నా గొప్ప స్థానం మరోటి ఉండదు..అసలు తెలుగు సినిమాకు ఈ స్థాయి ఉంటాది అని కూడా ఎవరు కలలో కూడా ఊహించలేదు.ఇంతకీ దేని గురించా అని అనుకుంటున్నారా…ఇంకా దేని గురించి దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన బాహుబలి 2 మూవీ గురించి మాట్లాడుతున్నాం..

విడుదలైన మొదటి రోజు నుండే రికార్డ్స్ సృష్టిస్తూ వస్తున్న ఈ మూవీ , తాజాగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ లో అడుగు పెట్టింది. బాహుబలి2 చిత్రం నిన్నటి వరకు 900 కోట్ల రూపాయలని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ రోజు ఆదివారం హాలీడే కావడంతో ఈ సినిమా థియేటర్స్ అన్ని హౌజ్ ఫుల్ అయ్యాయి. దీంతో బాహుబలి 2 చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ని ఈజీగా దాటింది. ఈ విషయాన్ని బాహుబలి టీం కూడా అఫీషియల్ గా ప్రకటించింది.

గతంలో ఏ భారతీయ చిత్రం కూడా ఈ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోపోగా, బాహుబలి2 చిత్రం అవలీలగా ఈ రికార్డుని చెరిపేసింది. కేవలం వారం తిరిగే లోపే ఈ రికార్డు సాధించడం ఒక్క బాహుబలి కే చెల్లిందని అంత మాట్లాడుకుంటున్నారు. చిత్ర యూనిట్ తో పాటు , ప్రభాస్ తన అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.

Exit mobile version