బాహుబలి 2 చిత్రాన్ని ఎవ్వరు మరచిపోలేరు. ఆ భాష , ఈ భాష అని తేడా లేకుండా అన్ని భాషల్లో ఈ మూవీ కనక వర్షం కురిపించింది. కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకొని , అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇప్పుడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నట్లు సర్వేలో తేలింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి అనేది మీరే చూడండి.
పైరసీ అనే భూతం అన్ని ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న సంగతి తెల్సిందే. దర్శక నిర్మాతలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, పైరసీదారులని అరికట్టలేకపోతున్నారు. చిన్న సినిమాలకే కాదు భారీ బడ్జెట్ చిత్రాలని కూడా ఈ రాకాసీ భూతం పట్టి పీడిస్తుండడంతో నిర్మాతలు నష్టపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మరెన్నో టెక్నాలజీలు వాడిన పైరసీ భూతం నుండి బాహుబలి 2 ను కాపాడలేకపోయాడు. స్మార్ట్ ఫోన్స్ లో బాహుబలి 2 చిత్ర హెచ్ డి ప్రింట్ సినిమా రిలీజైన కొద్ది రోజులకే వచ్చింది.
2017లో విడుదలైన మరో రెండు చిత్రాలు దువ్వాడ జగన్నాథమ్, అర్జున్ రెడ్డి చిత్రాలు కూడా ఎక్కువగా పైరసీ అయ్యాయట. ఒ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో పైరసీ బారిన పడిన మొదటి చిత్రంగా బాహుబలి 2 ఉంటే రెండో స్థానం లో డీజే, మూడో స్థానం లో అర్జున్ రెడ్డి చిత్రాలు నిలిచాయి.