Site icon TeluguMirchi.com

జాగ్రత్త : బాహుబలి మూవీ నకిలీ టికెట్స్ వచ్చాయి…

Baahubali-2-New

దేశ వ్యాప్తంగా బాహుబలి మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది..దీంతో ఆ మూవీ టికెట్స్ కోసం ఎంతగా కొట్టుకుంటున్నారో తెలియంది కాదు..ఇదే అదునుగా చేసుకొని ఓ ముఠా బాహుబలి మూవీ టికెట్స్ అంటూ ప్రేక్షకులను దోచుకునే పని మొదలు పెట్టింది..కానీ వారి ఆటలను పసి గట్టిన పోలీసులను వారిని అరెస్ట్ చేసారు..ఇంతకీ వీరు ఎలా దోచుకుంటున్నారు అంటే…

www.newtickets.in పేరిట ఒక వెబ్‌సైట్‌ ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది.. బాహుబలి టిక్కెట్లు అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్‌తోపాటు అమెరికా, ఇంగ్లాండులోని కొన్ని సినిమా హాళ్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది. సైట్‌లోకి వెళ్లాక సినిమాహాళ్ల పేర్లన్నీ ప్రత్యక్షమవుతూ, సీట్లు కూడా కనిపిస్తున్నాయి. టిక్కెట్లు బుక్‌ చేసుకొని ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు చెల్లించగానే ఆ అంశాన్ని నిర్ధరిస్తూ మరుక్షణమే ఫోన్‌కు సందేశం వస్తుంది. ఒక్కో టిక్కెట్‌ రూ.120 చొప్పున అమ్ముతున్నారు. ఈ వ్యవహారం తెలిసి ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌ వారు పోలీసులుకు చెప్పారు..అసలు వారితో మీము ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని తేల్చారు..రంగం లోకి దిగిన పోలీసులు ఈ వెబ్ సైట్ ఎక్కడిదా అని ఆరా తీయగా..

కోయంబత్తూర్‌ చిరునామాతో ఈనెల 7న వెబ్‌సైట్‌ నమోదు చేయించారు. ఏడాది కోసం సర్వర్‌ను లీజుకు తీసుకున్నారు. డబ్బు చెల్లింపులకు ‘పేయూమనీ’తో ఒప్పందం చేసుకున్నారు. అసలు ఏ థియేటర్ వారు కూడా ఈ సైట్ తో సంప్రదింపులు చేసుకోలేదట..ఇది కేవలం మోస పూరిత వెబ్ సైట్ అని ఇలాంటివి ప్రేక్షకులు నమ్మకూడదని పోలీసులు తేల్చారు.

Exit mobile version