బాహుబలి 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

బాహుబలి 2 చిత్రం విజయవంతంగా రెండో వారం లోకి అడుగుపెట్టింది..దర్శక ధీరుడు తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ మూవీ..యావత్ సినీ ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకొని ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కాదు హాలీవుడ్‌లో టాప్ 3 మూవీగా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా అంచనాలకు అందకుండా.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బాహుబలి ది కన్‌క్లూజన్ రోజుకో రికార్డును తిరగరాస్తూ రికార్డుల రారాజుగా సవాల్ విసురుతోంది.

తొలిరోజే వందకోట్లను క్రాస్ చేసిన ఈ మూవీ వారం తిరిగే సరికి 800 కోట్లకు చేరువకావడంతో యావత్ సినీ పరిశ్రమ ప్రశంసల జల్లు కురిపిస్తుంది. గత ఐదు రోజుల్లో బాహుబలి2 సినిమా రూ.700 కోట్ల మార్కును దాటి.. తాజాగా 7వ రోజుకు వచ్చేసరికి రూ.800 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ఇప్పటి వరకు రూ. 743 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో నెం.1 స్థానంలో ఉన్న ‘పి.కె’ మూవీ బాహుబలి దెబ్బకు రెండో స్థానికి పడిపోయింది.

బాహుబలి 2 వెయ్యికోట్లను ఈజీగా క్రాస్ చేసి.. సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ కలెక్షన్స్‌లో దుమ్ములేపుతున్న బాహుబలి 2 మూవీ ఫుల్ రన్‌లో రూ. 1500 కోట్లను వసూలుచేయడం ఖాయంగా కనిపిస్తుంది.