Site icon TeluguMirchi.com

బాహుబలి 2 ని చెత్త సినిమాగా తేల్చాడు..

ప్రపంచ వ్యాప్తంగా జయహో..బాహుబలి..జయహో రాజమౌళి..సాహో ప్రభాస్ అంటూ అందరూ గొప్పగా చెపుతుంటే…ఇతడు మాత్రం బాహుబలి చిత్రాన్ని చెత్త చిత్రంగా తేల్చడం కాదు ప్రభాస్ , రానా లను కార్టూన్స్ గా అభివర్ణించారు…ఇంతకీ అతడెవరంటే..బాలీవుడ్ సినిమాలపై రివ్యూ లంటూ నానా హంగామా చేసే రివ్యూ రైటర్ కమల్ ఆర్ ఖాన్.

తనకు తానే గొప్ప అని చెప్పుకునే ఇతడు..నిన్న బాహుబలి చిత్రాన్ని కార్టూన్ల చిత్రం తో పోల్చాడు.. ఈ మూవీ లో నటించిన ప్రభాస్, రానా లు ఇద్దరు కార్టూన్స్ గా ఉన్నారని కామెంట్ చేసాడు. బాహుబలి పేరుతొ కార్టూన్ షో ని చూపించారని, ఈ సినిమాలో సన్నివేశం వాస్తవానికి దూరంగా ఉంటుందని సీరియస్ అయ్యాడు. కంప్యూటర్ గేమ్ లాంటి సినిమా ఇదని, ఈ ఏడాది చెత్త దర్శకుడిగా రాజమౌళి కి అవార్డు ఇవ్వొచ్చని చెత్త కామెంట్స్ చేసాడు. ఈ చెత్తగాడి చెత్త కామెంట్స్ చూసి అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు..ఫ్యాన్స్ ముందు ఈ మాట అని చూడు తెలుస్తుంది అంటూ అతడికి ఘాటుగా కామెంట్స్ రూపం లో సమాధానం చెపుతున్నారు. మరికొంతమంది అయితే జనాభా లెక్కలోనే ఇతడిని తీసేసాం..అలాంటిది వీడి మాటలు ఎవరు పట్టించుకుంటారని అంటున్నారు. మొత్తం మీద చెత్త కామెంట్స్ చేసి మీడియా లో నిలిచాడు.

Exit mobile version